ఆర్.ఆర్.ఆర్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై అసహనం వ్యక్తం చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టాప్ డైరెక్టర్ రాజమౌళి బుధవారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఓ ఘటన ట్వీట్ రూపంలో తెలియజేసారు. తాను ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగిన తర్వాత కరోనా ఆర్టీ పిసిఆర్ టెస్ట్ కోసం ఫామ్ ఫిలిప్ చెయ్యడానికి అక్కడ ఎయిర్ పోర్ట్ లో కనీస వసతులుకూడా లేవా అనిపించింది. ఆ ఫామ్ ఫిలిప్ చెయ్యడానికి కొంతమంది గోడకి ఆనించి రాస్తుండగా.. మరికొందరు నేలపై కూర్చుని ఆ ఫామ్ ఫిల్ చెయ్యడం చూసాక. అక్కడ కనీసం బెంచెస్ అయినా వేస్తె బావుండేది.
అంతేకాదు.. ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే అక్కడ ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి.. అంటూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఉన్న పరిస్థితులపై రాజమౌళి ట్వీట్ చేసారు. రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.