Advertisementt

పెళ్లి చేసుకుంది.. ఇంటికి సమన్లు వచ్చాయి

Fri 02nd Jul 2021 06:42 PM
yami gautam,ed summons,yami gautam troubles,ed summons yami gautam,yami gautam photos,yami gautam marriage,bollywood actress yami gautam  పెళ్లి చేసుకుంది.. ఇంటికి సమన్లు వచ్చాయి
ED summons Yami Gautam పెళ్లి చేసుకుంది.. ఇంటికి సమన్లు వచ్చాయి
Advertisement
Ads by CJ

తెలుగులో తరుణ్, అల్లు శిరీష్, నితిన్ సరసన సినిమాలు చేసిన యామి గౌతమ్ కి టాలీవుడ్ కలిసిరాలేదనే చెప్పాలి. దానితో బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యి అక్కడే అవకాశాల కోసం ఎదురు చూసింది. అప్పుడో ఇప్పుడో బాలీవుడ్ లో కాబిల్, సర్కార్ త్రీ, ఉరి ది సర్జికల్ స్ట్రైక్, గిన్నీ వెడ్స్ సన్నీ సినిమాలతో పేరు తెచ్చుకుని హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో బాగా ఫెమస్ అయిన యామి గౌతమ్ లాక్ డౌన్ లో చెప్పాపెట్టకుండా సైలెంట్ గా పెళ్లి పీటలెక్కేసింది. ఉరి సినిమా దర్శకుడు ఆదిత్య ధార్ తో ప్రేమలో పడి లాక్ డౌన్ లో కామ్ గా పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైంది. 

అయితే తాజాగా యామి చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తుంది. ఈడి అధికారుల ముందు జులై 7 న హాజరు కావాల్సిందిగా యామి గౌతమ్ కి ఈడి సమన్లు జారీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. యామి గౌతమ్ పర్సనల్ బ్యాంకు ఖాతాలో కోటిన్నర విదేశీ మారక లావాదేవీలు జరిగాయని.. కానీ యామి దీని గురించి అధికారులకు తెలియజేయలేదని తెలుస్తోంది. దానితో విచారణ చేపట్టిన అధికారులకు బ్యాంకు ఖాతాలను యామి గౌతమ్‌తో అనుసంధానించినట్లు తేలిందని.. ఆ తర్వాతే యామి గౌతమ్ కి సమన్లు​​ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. జులై 7 న యామి ఈడి అధికారుల ముందు హాజరవ్వాల్సి ఉంది. 

ED summons Yami Gautam :

Trouble for Yami Gautam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ