Advertisementt

అమీర్ ఖాన్ లైఫ్ లో రెడోసారి..

Sat 03rd Jul 2021 02:05 PM
aamir khan,kiran rao,aamir shocked fans,announcing their divorce,aamir khan and kiran rao. amir khan son  అమీర్ ఖాన్ లైఫ్ లో రెడోసారి..
Aamir Khan and Kiran Rao Announce Divorce అమీర్ ఖాన్ లైఫ్ లో రెడోసారి..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా మూవీ షూటింగ్ తో బిజీగా వున్నారు అనుకుంటే.. ఆయనిప్పుడు ఓ ప్రకటన చేసి షాకిచ్చారు. అది తన భార్య కిరణ్ రావు తో విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించే అమీర్ ఖాన్ ఆయన వైఫ్ కిరణ్ రావు లు అధికారికంగా విడిపోతున్నట్టుగా ప్రకటించారు. అసలు తాము విడిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నామని.. దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని ఇరువురు చెబుతున్నారు. 

గతంలో అమీర్ ఖాన్ 1986లో రీనా ద‌త్త‌ను పెళ్లి చేసుకుని.. 2002లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత నాలుగేళ్లకు కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లాడారు. ఇక అమీర్ ఖాన్ - కిరణ్ రావు దంపతులకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం విడాకులు తీసుకుని, వేరు అయ్యి.. కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నామని చెబుతున్న అమీర్ ఖాన్ - కిరణ్ రావు లు త‌మ కుమారుడి బాధ్య‌త‌ను ఇద్ద‌రం తీసుకుంటామ‌ని తెలిపారు. అంతేకాకుండా సినిమాలు, పానీ ఫౌండేష‌న్ కార్య‌క‌లాపాల్లో క‌లిసే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. పెళ్లయిన 15 ఏళ్ళకి ఈ జంట ఎందుకు విడిపోతుందో అసలైన కారణాలు తెలియరాలేదు. ఇక గతంలో విడాకులతో పెద్ద భర్యతో విడిపోయిన అమీర్ ఇప్పుడు మరోసారి రెండో భర్యకి విడాకులివ్వడం ఆయన ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.   

Aamir Khan and Kiran Rao Announce Divorce:

Aamir Khan and Kiran Rao shocked fans by announcing their divorce

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ