Advertisementt

ఏజెంట్ కి మలయాళ కాస్ట్లీ ఫ్లేవర్

Sat 03rd Jul 2021 04:21 PM
malayalam actor,mammootty,akhil akkineni,villain in agent,surender reddy -akhil combo  ఏజెంట్ కి మలయాళ కాస్ట్లీ ఫ్లేవర్
Mammootty is Akhil Akkineni villain ఏజెంట్ కి మలయాళ కాస్ట్లీ ఫ్లేవర్
Advertisement
Ads by CJ

ఇంతవరకు హీరోగా సూపర్ హిట్ అనేదే లేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. ఈమధ్యన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని ఆహా ఓటిటి నుండి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలొచ్చినా.. టీం మాత్రం థియేటర్స్ లోనే సినిమా ఉంటుంది అన్నారు. అదలా ఉంటె.. హీరో గా కమర్షియల్ సక్సెస్ లేని అఖిల్ మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. మాస్ గా రఫ్ లుక్ లో ఏజెంట్ గా అఖిల్ లుక్ అదిరింది. హాలీవుడ్ స్టయిల్ లో అఖిల్ ని రా ఏజెంట్ గా సురేందర్ రెడ్డి చూపించబోపోతున్నాడట. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు. 

అయితే ఏజెంట్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ నటుడు మమ్ముట్టిని సంప్రదించిందట టీం. ఇతర భాషలు నటులు వేరే భాషల సినిమాల్లో కనిపించడం కొత్తకాదు కానీ.. వారిప్పుడు తెలుగు సినిమాలు చెయ్యడానికి భారీగా డిమాండ్ చేస్తున్నట్టే.. అఖిల్ ఏజెంట్ లో నటించడానికి మమ్ముట్టి అక్షరాలా మూడు కోట్లు అడిగినట్లుగా తెలుస్తుంది. ఇక మమ్ముట్టి అడిగిన అమౌంట్ కి ఏజెంట్ మేకర్స్ సిద్దపడిపోయినట్లుగా తెలుస్తుంది. అంతగా ఫామ్ లో లేని మమ్ముట్టికి మూడు కోట్లు అంటే ఏజెంట్ మేకర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. 

Mammootty is Akhil Akkineni villain :

Mammootty is Akhil Akkineni villain in Agent

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ