విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ గా మారటమే కాదు.. ప్రభాస్ తర్వాత అందరికన్నా ముందుగా పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. పూరి జగన్నాధ్ తో లైగర్ పాన్ ఇండియా మూవీ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పటినుండి బాలీవుడ్ లో క్రేజీ పార్టీలతో, లైగర్ షూటింగ్ కోసం ముంబై లోనే ఉంటున్న విజయ్ దేవరకొండ క్రేజ్ అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా విజయ్ తో మూవీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా బాలీవుడ్ బడా ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ షూట్ లో మెరిసిన విజయ్ దేవరకొండ బైక్ పై ఇచ్చిన ఫోజ్ కి యూత్ మొత్తం సలాం కొట్టారు. రౌడీ హీరోకి రౌడీ ఫాన్స్ అంటూ ఆయనకి అభిమానగణము ఎక్కువే.
అయితే తాజాగా ఈ ఆదివారం విజయ్ దేవరకొండ బైక్ దగ్గర కూర్చుని ఉన్న ఫోటీని షేర్ చేసి నేను రెడీ అంటున్నాడు. అంటే లైగర్ షూటింగ్ కి రెడీ అయ్యాడా విజయ్ అంటున్నారు. ముంబై లో పూరి - ఛార్మీలు లైగర్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా రెస్యూమ్ షూట్ మొదలు కాలేదు. దాని కోసమే విజయ్ దేవరకొండ రెడీ అంటున్నాడా.. లేదంటే కొత్త ప్రాజెక్ట్ ఎమన్నా మొదలు పెట్టబోతున్నాడా అనేది రౌడీ ఫాన్స్ కి అర్ధం కావడం లేదు. ఇక డబ్బు రత్నాన్ని కేలెండర్ షూట్ రోజునే విజయ్ ఆ బైక్ దగ్గర దిగిన పిక్ అది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాటుగా లైగర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.