Advertisementt

బాలయ్య - శ్రీవాస్ కాంబో స్టోరీ అదేనా

Mon 05th Jul 2021 01:34 PM
balakrishna,director srivaas,balakrishna - director srivaas,balakrishna akhanda,director srivaas with balayya  బాలయ్య - శ్రీవాస్ కాంబో స్టోరీ అదేనా
Balakrishna - Srivas Story revealed బాలయ్య - శ్రీవాస్ కాంబో స్టోరీ అదేనా
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ముందు బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీ షూటింగ్ ఫినిష్ చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. అఖండ ఫైనల్ షెడ్యూల్ ఆంధ్ర లోని చారిత్రాత్మక స్థలంలో మొదలు కాబోతుంది. అఖండ రిలీజ్ డేట్ ని థర్డ్ వేవ్ కరోనా సంగతి చూసాకే ప్రకటిస్తామని దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో అఖండ ఇప్పట్లో లేనట్లే అని అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇక బాలకృష్ణ బోయపాటి సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చెయ్యబోతున్నారు. 

దాని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ కనిపిస్తారని టాక్. ఇక తాజాగా బాలయ్య శ్రీవాస్ దర్శకత్వంలో మూవీ చెయ్యడానికి కమిట్ అవ్వబోతున్నారానే న్యూస్ నడుస్తుంది. గతంలో డిక్టేటర్ మూవీ చేసిన శ్రీవాస్.. ఇప్పుడు బాలయ్య కోసం అదిరిపోయే క్లాస్ కథని రెడీ చేసాడట. అంటే స్టైలిష్ గా బాలయ్య ని ఓ బడా కంపెనీ కి సీఈవో గా చూపించడానికి రెడీ కాబోతున్నాడట. కార్పొరేట్ రాజ‌కీయాల నేప‌థ్యంలో శ్రీ‌వాస్ ఓ క‌థ రాసుకుని అది బాల‌య్య‌కు స‌రిపోతుంద‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. 

ఓ చిన్న ఊరు నుంచి పెద్ద కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఓ వ్య‌క్తి క‌థ గా ఈ సినిమా ఉండబోతుందట. అంత పెద్ద కంపెనీ కి సీఈవో అయ్యుండి మ‌ళ్లీ త‌న ఊరికి, త‌న దేశానికి… త‌ను సంపాదించిన జ్ఞానాన్నీ, సంపాద‌న‌నీ పంచివ్వాలనే తాపత్రయంతో ఉండే వ్యక్తి కథగా ఉంటుందట. మరి శ్రీవాస్ - బాలయ్యకి కథం చెప్పి ఒప్పించి సినిమాని పట్టాలెక్కించాలంటే మరో మూడేళ్లు పట్టడం ఖాయం. 

Balakrishna - Srivas Story revealed:

Balakrishna Next Movie With Director Srivaas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ