మహేష్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెయ్యలేదు. ఆఖరికి కళ్యాణ్ రామ్ కూడా పాన్ ఇండియా లోకి అడుగుపెట్టేస్తున్నాడు. మహేష్ ప్రెజెంట్ మూవీ సర్కారు వారి పాట, ఆ తర్వాత SSMB28 కూడా పాన్ ఇండియా మూవీస్ గా చెయ్యడం లేదు. ఒకేసారి రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎలాగూ రాజమౌళి పాన్ ఇండియా మూవీస్ తప్ప మరో మూవీ చెయ్యడు. సో అలా మహేష్ కల నెరవేరుతుంది. ఎప్పటినుండో రాజమౌళి - మహేష్ బ్యాగ్డ్రాప్ పై రకరకాల కథనాలు ప్రచారం లో ఉన్నా.. అవన్నీ గాలి వార్తలే అని మహేష్ - రాజమౌళి కాంబో నిర్మాత కొట్టిపారేశాడు.
కానీ టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రం మహేష్ - రాజమౌళి కాంబో కథపై ఎప్పటినుండో చర్చలు జరుగుతూన్నాయని, కానీ కథ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పడంతో మరోసారి మహేష్ - రాజమౌళి కాంబో మూవీ పై సోషల్ మీడియాలో న్యూస్ లు జోరందుకున్నాయి. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. మహేష్ - రాజమౌళి కాంబో హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్ తరహాలో సాగనుందనే హింట్ ఇచ్చేసారు. మరి ఇండియానా జోన్స్ సినిమాలు చూసిన వారికి అయితే మహేష్ ఆ తర్వాత సినిమాలకు పర్ఫెక్ట్ గా సెట్టవుతాడు అని అర్ధం అవుతుంది. నిజంగా అదే జరిగితే మహేష్ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ చేసినట్టే. ఇక రాజమౌళి తో కలిసి మహేష్ హాలీవుడ్ రేంజ్ మూవీ చేయబోతున్నాడని అందరూ ఫిక్సయిపోండి.