పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు షూటింగ్స్ కి సిద్ధమవుతారు.. టాలీవుడ్ హీరోలు చాలామంది షూటింగ్స్ చేసేస్తున్నారంటూ అంటూ పవన్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్న సోమవారమే పవన్ కళ్యాణ్ - రానా కలిసి ఏకే రీమేక్ షూట్ లోకి అడుగుపెట్టేసారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ కనుసన్నల్లో అయ్యప్పన్ కోషియం రీమేక్ రెస్యూమ్ షూట్ అధికారికంగా మొదలైంపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుంది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ - రానా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. కారణం పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. అక్కడ రౌడీలుగా నటిస్తున్న వారంతా పవన్ తో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో పవన్ ఏకే రీమేక్ షూట్ విషయాలు ట్రేండింగ్ లోకి వచ్చేసాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ లుక్ లో కనిపించనున్నారు. ప్రెజెంట్ పోలీస్ డ్రెస్ కాదు కానీ.. నార్మల్ డ్రెస్ లో అంటే సస్పెండ్ అయిన మాములు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఆ లుక్ లో పవన్ కనిపిసిస్తున్నారు. ప్రస్తుతం పవన్ తో అభిమానులు దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.