రామ్ చరణ్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో బిజీగా వున్నాడు. అట సోమవారమే మొదలైన ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబో సీన్స్ అలాగే సాంగ్ చిత్రీకరణతో ఆర్.ఆర్.ఆర్ టీం బిజీగా వుంది. అంటే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం ఆచార్య షూట్ కూడా నేడు మొదలయ్యింది. ఎప్పుడో షూట్ పూర్తయ్యి.. రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య కరోనా లాక్ డౌన్ వలన ఆగిపోయింది.
ఇక నేడు ఆచార్య రెస్యూమ్ షూట్ మొదలయ్యింది. ఈ లాస్ట్ షెడ్యూల్ లో చిరంజీవి .. చరణ్ ఇద్దరూ కూడా పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. చెర్రీ - చిరు కాంబోలో కొన్ని కీలమైన సన్నివేశాలను ప్లాన్ చేశారట. పది నుండి 15 రోజులు ఏకధాటిగా ఆచార్య లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేసేస్తే పూర్తి చిత్రీకరణ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. అలా రామ్ చరణ్ కి ఆర్. ఆర్.ఆర్ షూటింగ్, అలాగే ఆచార్య షూటింగ్స్ అంటూ డే అండ్ నైట్ షాఫ్ట్ ల్లో కష్టపడితేనే గాని.. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తికావు.