Advertisementt

పవన్ - హరీష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Wed 07th Jul 2021 09:12 PM
pawan kalyan,pspk28,harish shankar,pawan - harish shankar combo,pspk 28 update,interesting news on pspk28  పవన్ - హరీష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on PSPK28 పవన్ - హరీష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయ్యారు. చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటున్న పవన్ నేడు ఏపీ రాజకీయాల కోసం విజయవాడలో అడుగుపెట్టారు. ఇక ఇక్కడ హైదెరాబాద్ లో తన సినిమాల రెస్యూమ్ షూట్స్ కి హాజరవ్వబోతున్నారు. ఏకే రీమేక్, క్రిష్ హరిహర వీరమల్లు రెస్యూమ్ షూట్స్ మొదలు కాబోతున్నాయి. అయితే ఈ సినిమా ల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీ చెయ్యబోతున్నాడు. ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ లాగా.. కామెడీ ఎంటర్టైనర్ గానో, లేదంటే.. పొలిటికల్ నేపథ్యంలోనో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. 

అంతేకాదు పవన్ డ్యూయెల్ రోల్ లో ఒక పాత్రలో లెక్చరర్ గాను, మరొకటి పోలీస్ ఆఫీసర్ గాను కనిపించబోతున్నారంటూ ప్రచారం జరుగుంది. అయితే తాజాగా హరీష్ శంకర్ పవన్ సినిమాని పొలిటికల్ నేపథ్యంలో కాకూండా.. ప్రస్తుత విద్యాసంస్థపై ఓ సెటైరికల్ మూవీ గా తీస్తున్నాడట. పవన్ ఒక పాత్రలో కామెడిగాను, మరో పాత్రలో కాస్త సీరియస్ గా సమాజంలో విద్యావ్యవస్థలో లోపాలను ప్రశ్నిస్తాడని.. అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో PSPK 28 మాత్రం అందరిని ఎంటర్టైన్ చెయ్యడం పక్కా అంటున్నారు. 

Interesting news on PSPK28 :

PSPK 28 update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ