ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ అనే మాస్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. సెకండ్ వేవ్, కెజిఎఫ్ మూవీస్ వలన ఆగిన సలార్.. మళ్ళీ ఆగష్టు నుండి రెస్యూమ్ షూట్ మొదలు పెట్టుకోబోతుంది. ఈలోపు ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడం, ఆదిపురుష్ కి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేసి సలార్ కోసం రెడీ అవుతారు. ఇక ప్రశాంత్ నీల్ కూడా కెజిఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ చేసి రిలీజ్ కి సిద్ధం చేసేసి సలార్ షూట్ కి వచ్చేస్తారు. అయితే ఈ సినిమాలో ఓ 8 మంది విలన్స్ ఉండబోతున్నారట.
సలార్ ఎలాగూ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. దానికి మర్కెట్ కావాలంటే అన్ని భాషల నుండి విలన్స్ ని సెలెక్ట్ చెయ్యాలి. అందులో ముందుగా మెయిన్ విలన్ గా విజయ్ సేతుపతి అనుకుంటే.. ఆయనేమో డేట్స్ లేవని సున్నితంగా చెప్పేశారట. అంటే 7 గురు ఆకు రౌడీలలాంటి విలన్స్ ఉన్నా.. ఓ మెయిన్ విలన్ గా మంచి పేరున్న నటుడిని తీసుకోవాలని.. అది సౌత్ లేదా నార్త్ నుండి ఎంపిక చెయ్యాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నారట. ఇప్పటికే కన్నడ నుండి ఓ నటుడిని ఓ విలన్ కేరెక్టర్ కి ఎంపిక చేసేసారు. మరి ఫైనల్ గా ప్రభాస్ సలార్ కి మెయిన్ విలన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి.