సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం హెల్త్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకుని తిరిగి ఇండియా కి పయనమవ్వబోతున్నారు. అయితే రజినీకాంత్ ఆయన ఆరోగ్యం రీత్యా సినిమాలను వదిలేస్తున్నారు.. అందుకే రాజకీయాల నుండి తప్పుకున్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఎంత ప్రచారం జరిగినా రజినీకాంత్ కూడా కొన్నాళ్ళు సినిమాల్లో ఉండాలని ఉన్నా.. ఆరోగ్యం సహకరిస్తుందో లేదో అంటూ అప్పుడప్పుడు హింట్స్ ఇస్తున్నారు.
ఇక రజినీకాంత్ రీసెంట్ మూవీ అన్నాత్తే షూటింగ్ కూడా ఫినిష్ అయ్యి రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే సూపర్ స్టార్ రజిని ఇప్పుడొక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. అది రజిని అన్నాత్తే తర్వాత ఆయన కూతురు సౌందర్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదే రజనీ చేసే చివరి సినిమా అవుతుందని అంటున్నారు. మరి నిజంగానే ఆయన కూతురుతో చేసే సినిమానే చివరి సినిమా అవుతుందా? ఇది నిజమైతే సూపర్ స్టార్ ఫాన్స్ ఊరుకుంటారా? అసలు ఫాన్స్ ఏమైపోతారో పాపం.