టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ మంచి పొజిషన్ ని మెయింటింగ్ చేస్తూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరుచుకున్న హీరోయిన్ తాప్సి.. వ్యక్తిగతంగానూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. చెల్లి, బాయ్ ఫ్రెండ్స్ తో తాప్సి ఎక్కువగా ట్రిప్స్ వేస్తుంటుంది. విదేశీ బ్యాడ్మింటన్ ఆటగాడు, కోచ్ మథయాస్ బో తో డేటింగ్ చేస్తున్న తాప్సీ.. తన పెళ్లి మేటర్ ని బయటపెట్టింది. అంటే ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని, కెరీర్ లో ఇంకా సాధించాల్సింది ఉంది అని, అనుకున్నది సాధించాక తప్పక పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అయితే తన తల్లితండ్రుల్లో తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమో అనే భయం ఉన్నట్లుగా చెబుతుంది తాప్సి.
అంతేకాదు తన పేరెంట్స్ కి పెళ్లి కొడుకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను అని, నచ్చకపోతే చేసుకునే ప్రసక్తే లేదని.. తాను డేటింగ్ చేసే ప్రతి ఒక్కరితో అదే చెబుతాను అని, ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకునే తాను రిలేషన్ షిప్ కోసం అయినా, డేటింగ్ కోసం అయినా సమయాన్ని కేటాయిస్తానని.. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని టైమ్ పాస్ చేయనని చెబుతుంది. ఇక ఏడాదిలో ఐదారు సినిమాలు కాకుండా.. ఒకటి రెండు సినిమాలు చేస్తూ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని చెబుతుంది తాప్సి.