మలయాళ నటులు ఫహద్ ఫాసిల్ ఆయన వైఫ్ నజ్రియాలు ఇప్పుడు ఒకేసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీలో విలన్ గా నటిస్తున్నారు. పవర్ ఫుల్ విలన్ గా ఫహద్ కేరెక్టర్ పుష్ప లో ఉండబోతుంది అని.. అల్లు అర్జున్ పుష్పరాజ్ మాస్ లుక్ చూస్తే తెలుస్తుంది. ఆ లెవెల్ లోనే ఫహద్ లుక్ కూడా ఉంటుంది.. అని అల్లు అర్జున్ ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కి ముందు అల్లు అర్జున్ కి కరోనా సోకడం, సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఫహద్ పుష్ప షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు.
ఇక ఆయన వైఫ్ నజ్రియా కూడా నాని హీరోగా తెరకెక్కుతున్న అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్. ఫహద్ కన్నా ముందే నజ్రియా హైదరాబాద్ షూటింగ్ నుండి చెన్నై కి వెళ్ళిపోయింది. ఇక తాజాగా టాలీవుడ్ అంతా షూటింగ్స్ హడావుడితో సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. రెండు రోజుల క్రితమే అల్లు అర్జున్ పుష్ప సెట్స్ మీదకి వెళ్లగా.. ఈరోజు విలన్ పాత్రధారి ఫహద్ సికింద్రాబాద్ లో జరుగుతున్న పుష్ప షూటింగ్ సెట్స్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేసారు. మరి భార్య నజ్రియా ఇంకా.. అంటే సుందరానికి స్సెట్స్ మీదకి వచ్చినట్టుగా ఇంఫార్మేషన్ లేదు.