Advertisementt

కుర్ర హీరోల ఫైనల్ ఫైట్

Sat 10th Jul 2021 10:45 AM
naga shourya,lakshya movie,varun tej,gani movie,naga shourya -lakshya,varun tej - gani movie updates  కుర్ర హీరోల ఫైనల్ ఫైట్
Young heroes Movie updates కుర్ర హీరోల ఫైనల్ ఫైట్
Advertisement
Ads by CJ

సెకండ్ వేవ్ ముగియగానే యంగ్ హీరో నితిన్ మ్యాస్ట్రో ఫైనల్ షూట్ మొదలు పెట్టడం.. దానిని ఫినిష్ చేసెయ్యడం చూసాము. ఆ తర్వాత టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా షూటింగ్స్ తో ఒక్కొక్కరిగా బిజీ అవుతున్నారు. తాజాగా నాగ శౌర్య - వరుణ్ తేజ్ లు తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ గత వారమే అనిల్ రావిపూడి ఎఫ్ 3 షాట్ లో జాయిన్ అవ్వగా.. ఈ రోజు నుండి ఆయన నటిస్తున్న మరో చిత్రం గని ఫైనల్ షెడ్యూల్ మొదలయ్యింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న గని షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది టీం. 

ఇక నాలుగైదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మరో యంగ్ హీరో నాగ శౌర్య లక్ష్య క్లైమాక్స్ షూట్ లో జాయిన్ అయ్యాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ల‌క్ష్య. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇత‌ర‌నటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్ష‌కుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్‌.

Young heroes Movie updates :

Naga Shourya-Lakshya, Varun tej - Gani Movie updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ