Advertisementt

హైపర్ ఆదికి పెళ్లి.. పిల్ల ఎవరంటే

Sat 10th Jul 2021 11:47 AM
jabardasth,jabardasth comedian,hyper aadi,aadi marriage. aadi weds deepika pilli,fyper aadi - deepika pilli wedding  హైపర్ ఆదికి పెళ్లి.. పిల్ల ఎవరంటే
Jabardasth comedian Hyper Aadi Marriage హైపర్ ఆదికి పెళ్లి.. పిల్ల ఎవరంటే
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో సీనియర్స్ లిస్ట్ లో సుడిగాలి సుధీర్, భాస్కర్, ఆది లాంటి కమెడియన్స్ ఇంకా పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్ కెరీర్ అంటున్నారు. సుడిగాలి సుదీర్ - యాంకర్ రష్మీకి సం థింగ్ సం థింగ్ అంటుంటారు. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో వారికి ఈటివి చాలాసార్లే పెళ్లి చేసింది. ఉగాది పండగ సందర్భంగా సుధీర్ - రష్మి పెళ్లి గోల అంటూ ఓ షో చేసింది. రష్మీ - సుధీర్ ల జంట చూడముచ్చటగా పెళ్లి పీటలెక్కింది. అది ఉత్తిత్తి పెళ్ళే. అయినా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు అంటున్న సుధీర్ - రష్మీ మరోసారి పెళ్లి పీటలెక్కారు. 

వచ్చే గురువారం అనసూయ యాంకర్ గా రాబోతున్న జబర్దస్త్ షో లో రష్మీ - సుధీర్ పెళ్లి హైలెట్ కానుంది. ఇది కామన్ అయినా ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే హైపర్ ఆది - దీపికా పిల్లి పెళ్లి. ఢీ షో లో ముద్దుగా చూడచక్కగా ఆకట్టుకుంటున్న దీపికా పిల్లి - ఆది మధ్యన సం థింగ్ సం థింగ్ అంటున్నారు కానీ.. తాజాగా జబర్దస్త్ షో వాళ్లకి పెళ్లి చేసింది. సుధీర్ - రష్మీ, ఆది - దీపికా లను పెళ్లి బట్టల్లో రోజా, మనో వెంటబెట్టుకొచ్చి పెళ్లి పీటలెక్కించడం, అక్కడ పెళ్లి తంతు అబ్బో మాములుగా లేదు ఈ ఎపిసోడ్. వచ్చే వారం జబర్దస్త్ షో లో ఆది - దీపికా పిల్లి పెళ్లి ఓ హైలెట్ అవ్వబోతుంది. 

Jabardasth comedian Hyper Aadi Marriage:

Jabardasth New Episode promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ