Advertisementt

అక్కడ షాహిద్ భార్య - ఇక్కడ అల్లు అర్జున్ భార్య

Sat 10th Jul 2021 03:16 PM
shahid kapoor,wife mira rajput,workout video,allu arjun,wife allu sneha reddy,yoga pic,going viral  అక్కడ షాహిద్ భార్య - ఇక్కడ అల్లు అర్జున్ భార్య
Allu Arjun Wife Allu Sneha Reddy Yoga Pic Going Viral అక్కడ షాహిద్ భార్య - ఇక్కడ అల్లు అర్జున్ భార్య
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ మీరా రాజపుట్ ని  వివాహం చేసుకుని ఇద్దరి పిల్లలకి తండ్రయ్యాడు. మీరా రాజపుట్ షాహిద్ కపూర్ ని పెళ్లి చేసుకున్నాక బాలీవుడ్ మూవీస్ లో నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే మీరా రాజపుట్ హీరోయిన్ మెటీరియల్. హీరోయిన్స్ కి ఉండాల్సిన గ్లామర్, అందం, ఫిట్ నెస్ అన్ని మీరా సొంతం. పిల్లలు పుట్టాక కూడా మీరా రాజపుట్ అందంలో ఎలాంటి మార్పు లేదు. ఫిట్ నెస్ లో కూడా ఎలాంటి తేడా లేదు. షాహిద్ కపూర్ తో అవార్డు ఫంక్షన్స్ కి, ప్రవేట్ పార్టీలకు, వెడ్డింగ్స్ కి హాజరయ్యే మీరా రాజపుట్ అందమైన డ్రెస్సులతో అందరి మతులు పోగొడుతుంది. 

అయితే చాలామంది ఆమెకి అవకాలు ఇవ్వాలని చూసినా ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. ఇక భర్త తో కలిసి జిమ్ చెయ్యడం, అలాగే మంచి డ్రెస్సింగ్ తో అవుట్ సైడ్ షాపింగ్స్ కి వెళ్లే మీరా ని ఇప్పుడు సినిమాల్లోకి తీసుకొచ్చినా ఆమె హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడం పక్కా. 

ఇక ఇక్కడ టాలీవుడ్ యంగ్ హీరోస్ వైఫ్ లలో బన్నీ వైఫ్ స్నేహ రెడ్డి కూడా అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలోకి అడుగుపెట్టి.. ఇద్దరు పిల్లలకి తల్లయినా.. స్నేహ రెడ్డి అందం ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు.. ఫిట్ నెస్ లో అల్లు అర్జున్ తో పోటీ పడుతుంది. రీసెంట్ గా స్నేహ రెడ్డి యోగ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. స్నేహ అల్లు అర్జున్ తో కలిసి పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లినా, పర్సనల్ పార్టీలకు వెళ్లినా చక్కటి డ్రెస్ సెన్స్ తో చూడ చక్కగా కనిపిస్తుంది. మరి అక్కడ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ వైఫ్ మీరా అయితే ఇక్కడ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి ఫిట్ నెస్ లోను అందంలోనూ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. 

Allu Arjun Wife Allu Sneha Reddy Yoga Pic Going Viral:

Shahid Kapoor wife Mira rajput workout video viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ