Advertisementt

RAPO19 టైటిల్ ఫిక్స్ అంటగా

Sun 25th Jul 2021 06:21 PM
ram pothineni,ram - linguswami combo,tamil director,ram kriti shetty combo,krithi shetty heroine,ram rapo19 title,rapo19  RAPO19 టైటిల్ ఫిక్స్ అంటగా
RAPO19 locks interesting title RAPO19 టైటిల్ ఫిక్స్ అంటగా
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - రామ్ ల జోడి మాస్ ఊర మాస్ అంటూ ఇస్మార్ట్ శంకర్ తో యూత్ లో పూనకాలు తెప్పించారు. నాభ, నిధి అందాల ఆరబోత, రామ్ పోతినేని మాస్ పెరఫార్మెన్స్, మణిశర్మ మ్యూజిక్, పూరి మేకింగ్ స్టయిల్ అన్ని ఇస్మార్ట్ ని హిట్ తీరానికి నడిపించాయి. ఆ తర్వాత రామ్ ఓ తమిళ హిట్ మూవీని రెడ్ మూవీ గా రీమేక్ చేసాడు కానీ.. ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత రామ్ స్టార్ డైరెక్టర్స్ తో కమిట్ అవుతాడనుకుంటే.. తమిళ డైరెక్టర్ లింగుస్వామితో బైలింగువల్ మూవీ చేస్తున్నాడు. 

సెకండ్ వేవ్ కి ముందు పూజా కార్యక్రమాలతో మొదలైన RAPO19.. షూటింగ్ ఇంకా మొదలు పెట్టుకోలేదు. జులై 12 అంటే సోమవారం నుండి RAPO19 పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుండగా.. ఇప్పుడు RAPO19 టైటిల్ ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. RAPO19 యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. అందుకే ఈ సినిమాకి ఉస్తాద్ అని టైటిల్ పెడితే బావుంటుంది అని మేకర్స్ ఆలోచన అట. ఇస్మార్ట్ శంకర్ సినిమా సమయంలో పూరీ జగన్నాథ్ ఆ టైటిల్ కి ఉస్తాద్ అనే ట్యాగ్‌ను ఇచ్చాడు. ఇప్పుడు దీన్నే రామ్ కొత్త సినిమాకు టైటిల్‌గా వాడుతున్నారని టాక్. 

RAPO19 locks interesting title:

Speculation on Ram RAPO19 title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ