గత కొన్ని రోజులుగా రవితేజ RT68 పై అంచనాలు పెంచుతూ.. ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదులుతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్న రవితేజ కొత్త డైరెక్టర్ శరత్ తో RT68 మొదలు పెట్టారు. RT68 అంటూ గత వారం రోజులుగా రవితేజ ఆ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఎమ్మార్వోగా టైటిల్ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కారణం ఏమిటి అంటే RT68 పోస్టర్స్ లో రవితేజ సీరియస్ గా గవర్నమెంట్ ఆఫీస్ లో పని చెయ్యడం, రెండు చేతులతో వర్క్ చెయ్యడం చూసిన వారు రవితేజ ఎమ్మార్వో టైటిల్ కి పర్ఫెక్ట్ అనుకున్నారు.
అయితే తాజాగా రవితేజ RT68 టైటిల్ గా రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఫిక్స్ చేసి రవితేజ లుక్ తో పాటుగా టైటిల్ ని రివీల్ చేసారు మేకర్స్. RT 68 టైటిల్ రామారావు ఆన్ డ్యూటీ లుక్ లో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రవితేజ ఓ గవర్మెంట్ ఆఫీస్ లో సిన్సియర్ అధికారిగా పని చేస్తాడని.. ఆ టైటిల్ మీనింగ్ అన్నమాట. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యంశ కౌశిక్ నటిస్తుంది. ప్రస్తుతం RT68 టైటిల్ రామరావు ఆన్ డ్యూటీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.