తమిళ్ లో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన రచ్చసన్ మూవీ ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించారు. తెలుగులో మంచి హిట్ అయిన ఈ సినిమాని సత్యన్నారాయన కోనేరు నిర్మిచారు. అయితే ఇప్పుడు ఈ రాక్షసుడు సినిమాకి సీక్వెల్ రాబోతుంది. రమేష్ వర్మ దర్శకుడిగా కోనేరు సత్యన్నారాయణ నిర్మాతగా.. రాక్షసుడు 2 అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ నటించడం లేదు.
ఓ పెద్ద హీరో రాక్షసుడు సీక్వెల్ లో నటించబోతున్నాడని.. రాక్షసుడు మేకర్స్ అధికారిక ప్రకటనలో తెలియజేసారు. రాక్షసుడు గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అంటూ మేకర్స్ రాక్షసుడు సీక్వెల్ పై అనౌన్సమెంట్ ఇచ్చేసారు. టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే.. ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల ఓ చైన్‌కు రక్తంతో తడిసిన పదునైన కత్తి వేలాడుతుండడం మనం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్టర్లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతున్నాయి.
డిఫరెంట్ సెటప్‌లో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే రాక్షసుడు 2 చిత్రం రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజ ఖిలాడీ మూవీ ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఫినిష్ అవ్వగానే రమేష్ వర్మ రాక్షసుడు సీక్వెల్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.