Advertisementt

RC15 సినిమాకి మాటలు రచయిత ఎవరంటే

Tue 13th Jul 2021 01:37 PM
sai madhav burra,shankar-ram charan combo movie,rc 15,ram charan,kollywood top director shanakr,charan pan india movie  RC15 సినిమాకి మాటలు రచయిత ఎవరంటే
Star Writer On Board For RC15 RC15 సినిమాకి మాటలు రచయిత ఎవరంటే
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందుతున్న RC15 మూవీ షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు కాబోతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న RC15 పాన్ ఇండియా మూవీ పై ఇండియన్ మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్ ఈమధ్యనే చెన్నై వెళ్లి శంకర్ ఇంట్లో ఆతిధ్యం స్వీకరించి మరీ ఆయన మూవీపై చర్చలు జరిపిన విషయం ఓ పిక్ ద్వారా తెలియజేస్తూ ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు చేసారు. దిల్ రాజు బ్యానర్ లో 300 కోట్ల తో భారీ ప్రాజెక్ట్ గా మొదలు కాబోతున్న ఈ సినిమాకి మాటలు ఓ స్టార్ రైటర్ అందిస్తున్నారు. ఆయనే ప్రముఖ మాటలు రచయిత సాయి మాధవ్ బుర్ర. 

RC15 మాటల రచయితగా సాయి మాధవ్ బుర్ర పనిచేస్తున్న విషయాన్నీ ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అది కూడా శంకర్ తో కలిసి ఫోటో దిగిన బుర్ర సాయి మాధవ్... 

జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..Thanks to Sankar sir.. Thanks to Dil Rajugaru.. andThanks to our Mega Power Star Charanbabu🙏🙏🙏 అంటూ సాయి మాధవ్ బుర్ర ట్వీట్ చేసారు. 

Star Writer On Board For RC15:

Sai Madhav Burra on board for Shankar-Ram Charan Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ