టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కి సపరేట్ అభిమాన సంఘాలు ఉన్నాయి. మెగా అభిమానులంతా రామ్ చరణ్ కి సొంతం. నందమూరి అభిమానుల్లో ఎన్టీఆర్ అభిమానులు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అయినప్పటికీ నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ ని అభిమానిస్తారు. ఇద్దరికి ఈక్వల్ రేంజ్ క్రేజ్ టాలీవుడ్ లో ఉంది. అదే ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకునే కన్నా.. ఇద్దరి అభిమానులు కలిసి సోషల్ మీడియాని షేక్ చేస్తే.. ఇప్పుడదే జరుగుతుంది.
ఎన్టీఆర్ ఫాన్స్ - రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరూ కలిసి ఆర్.ఆర్.ఆర్ ని అందనంత ఎత్తులో నిలబెట్టబోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ నుండి జులై 15 మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తామన్నప్పటినుండి #RoarofRRR హాష్ టాగ్ తో చెర్రీ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్ ని ఊపేస్తున్నారు. Roar of RRR మేకింగ్ వీడియో ఆన్ ద వే అంటూ నానా హంగామా చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం హాష్ టాగ్స్ తో పాటుగా #RoarOfRRR హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తుంటే.. ప్రకాష్ రాజ్ పిక్స్ పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ వేర్వేరు కాదు.. అందరూ కలిసే ఉంటారు.. వారంతా ఒక్కటే అంటూ మీమ్స్ మొదలయ్యాయి.