Advertisementt

ఇంతందం టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందో

Wed 14th Jul 2021 04:07 PM
kollywood heroine,malavika mohanan,actress malavika mohanan,malavika mohanan glamour show  ఇంతందం టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందో
Tollywood star heroes approach Malavika Mohanan? ఇంతందం టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందో
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరి చూపు తనవైపే తిప్పుకున్న గ్లామర్ డాల్ మాళవిక మోహన్.. సోషల్ మీడియా రారాణిగా వెలిగిపోతుంది. మాళవిక మోహన్ సోషల్ మీడియా ఫోటో షూట్స్ చూస్తే అబ్బా ఎంతందంగా ఉన్నావే అనేస్తారు. మాస్టర్ లో విజయ్ సరసన నార్మల్ లుక్స్ తోనే కనిపించిన మాళవిక మోహన్.. తాజాగా ధనుష్43 లో నటిస్తుంది. ఈమధ్యన మాళవిక హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లుక్ కూడా తెగ వైరలయ్యింది. చిట్టిపొట్టి డ్రెస్సులతో కుర్రాళ్ళ మనసులను పిండేస్తుంది. 

ఇక తాజాగా సోషల్ మీడియాలో మాళవిక మోహన్ ఫోటో షూట్ ఒకటి వైరల్ గా మారింది. ఆ ఫొటోస్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఇంతందం మాకెప్పుడు చూపిస్తావ్ అంటున్నారు. మాస్టర్ రిలీజ్ అవ్వకముందు మాళవిక కి టాలీవుడ్ నుండి ఆఫర్స్ వెళ్లాయి. తాజాగా మహేష్ - త్రివిక్రమ్, రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా ఫిలిం హీరోయిన్స్ లిస్ట్ లో మాళవిక మోహన్ పేరు వినిపిస్తుంది కానీ.. మధ్యలో కియారా అద్వానీ మాళవిక మోహన్ కి ఎసరు పెట్టేలా ఉంది. మరి మాళవిక అందాలు ఏ తెలుగు హీరో టాలీవుడ్ కి దింపుతాడో చూడాలి. 

Tollywood star heroes approach Malavika Mohanan?:

Malavika Mohanan latest photoshoot goes viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ