Advertisementt

సర్‌ప్రైజ్: RAPO19 సెట్స్ లో కోలీవుడ్ శంకర్

Wed 14th Jul 2021 05:31 PM
kollywood director shankar,ram rap019,rapo 19 sets,lingusamy,krithi shetty,shankar - ram  సర్‌ప్రైజ్: RAPO19 సెట్స్ లో కోలీవుడ్ శంకర్
Director Shankar visited the sets of RAP019 సర్‌ప్రైజ్: RAPO19 సెట్స్ లో కోలీవుడ్ శంకర్
Advertisement
Ads by CJ

ఉస్తాద్ రామ్... RAPO19 టీమ్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో రామ్ సినిమా షూటింగ్ చూడడానికి విచ్చేశారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన చిత్రబృందం, ఆయనకు ఘన స్వాగతం పలికింది.

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ ఊర మాస్ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ బుధవారం సెట్స్ కి వచ్చారు. ఆయనతో సినిమా యూనిట్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్ గా సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్‌ గారిని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కృతి, నదియా, లింగుసామి స్వాగతం పలికారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అని అన్నారు. 

హీరోగా రామ్ 19వ చిత్రమిది. అందుకని, RAPO19గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

Director Shankar visited the sets of RAP019:

Kollywood Director Shankar visited the sets of RAP019

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ