సోను సూద్ ముంబై హీరో. బాలీవుడ్ నటుడు. ఆయనకు ముంబై లో అన్ని సదుపాయాలతో ఇల్లు ఉంది. సోను సూద్ ఎక్కువగా ముంబై లోనే ఉంటారు. బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ తో బాగా బిజీగా వుండే సోను సూద్ ఈమధ్యన కరోనా కష్ట కాలంలో అందరికి ఆత్మీయుడిగా మారిపోయాడు. సోను సూద్ పెద్ద మనసుతో చాలామందికి సహాయం చేసి దేవుడి మాదిరి పూజింపపడుతున్నాడు. అలానే సోను సూద్ కి టాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు బాగా పెరిగాయి. తెలుగులో ఆచార్య సినిమాలో విలన్ గా సోను సూద్ నటిస్తున్నాడు. అంతకుముందే సోను సూద్ టాలీవుడ్ హీరోలకు విలన్ గా చేసాడు.
ఇప్పుడు సోను సూద్ కి టాలీవుడ్ నుండి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టడంతో సోను సూద్ హైదరాబాద్ లోను ఓ ఇల్లు కొనేసాడు. ఇంతకుముందు సోను సూద్ తెలుగు సినిమా షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి నిర్మాతలు పార్క్ హయాత్ హోటల్ రూమ్స్ తీసేవారు. ఎక్కువగా సోను అక్కడే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆఫర్స్ తో ఎక్కువగా టాలీవుడ్ లో ఉండాల్సి వస్తుంది. అందుకే సోను సూద్ హైదరాబాద్ లోను ఓ ఇల్లు కొనుక్కుని.. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేలా అన్ని వసతులతో కూడిన ఇంటిని బంజారాహిల్స్ లో 10 కోట్లతో కొనుగోలు చేసినట్టు సమాచారం.