రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆర్.ఆర్.ఆర్ RoarofRRR సోషల్ మీడియాలో అదరగోట్టేస్తుంది. నిన్న ఆర్.ఆర్.ఆర్ టీం RoarofRRR మేకింగ్ వీడియో ని రిలీజ్ చేసింది. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్, ఆర్.ఆర్.ఆర్ పాత్రల లుక్స్, రాజమౌళి దర్శకత్వం, నిర్మాత బడ్జెట్ అన్ని RoarofRRR వీడియో లో చూపించారు. ఆ వీడియోపై బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషల ప్రేక్షకులు, సెలబ్రిటీస్ రాజమౌళి ని పొగిడేస్తున్నారు. తాజాగా రాజమౌళి RoarofRRR వీడియో పై స్పందిస్తూ.. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ హంగామా ఈ RoarofRRR వీడియో రిలీజ్ చేసినప్పుడు కనిపించింది అని, RoarofRRR వీడియో పట్ల అందరూ తనపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారని అన్నారు.
అయితే ప్రస్తుతం తాను ఆర్.ఆర్.ఆర్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని, RoarofRRR వీడియో కోసం రెండు నెలల పాటు కష్టపడి పనిచేసిన సినీ బృందంలోని పలువురు ఈ ప్రశంసలు అందుకోవడానికి అర్హులని రాజమౌళి చెప్పారు. రెండు నెలలుగా ఈ RoarofRRR వీడియో కోసం వారు పని చేసారని, ఈ RoarofRRR మేకింగ్ వీడియో ని రూపొందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేసారు. మరి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ వీడియో తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.