ఈమాట అంటున్నది నాని టక్ జగదీశ్ టీం. నాని - రీతూ వర్మ జంటగా శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కిన టక్ జగదీశ్ కరోనా సెకండ్ వేవ్ కి ముందే అంటే ఏప్రిల్ 23 న విడుదలకావాల్సి ఉంది. కానీ థియేటర్స్ క్లోజ్ అవడంతో టక్ జగదీశ్ రిలీజ్ వాయిదా పడింది. అయితే మొన్నామధ్యన టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అంటూ వార్తలొచ్చినా.. మేకర్స్ వాటిని ఖండించారు. మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఇక తాజాగా టుక్ జగదీశ్ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. జులై 30 సినిమా విడుదల అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వకుండానే టక్ జగదీశ్ ఈనెలాకరున రిలీజ్ అంటూ వార్తలు రావడంతో అలెర్ట్ అయిన టీం.. ఈ సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలను నమ్మకండి.. ఒకేవేళ రిలీజ్ డేట్ ఇస్తే మేమె చెబుతాము. అప్పటివరకు ఆగండి.. అంటూ టక్ జగదీశ్ రిలీజ్ పై సోషల్ మీడియా వేదికగా టక్ జగదీశ్ టీం క్లారిటీ ఇచ్చింది.