పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ రెస్యూమ్ షూట్స్ లో పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక తాజాగా సినిమా షూటింగ్స్ కి కూడా హాజరవుతున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ మూవీస్ చెయ్యాల్సి ఉంది. హరీష్ శంకర్ మూవీ ఈ ఏడాది చివరిలో మొదలవ్వబోతుంది. సురేందర్ రెడ్డి సినిమాకి టైం ఉంది. ఇక ఈలోపులో బబండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేసి పెడతా అని మాటిచ్చాడు. అప్పటినుండి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ దేవుడు, నా దేవుడు అంటూ తెగ భజన చేస్తున్నాడు. బండ్ల గణేష్ పవన్ విషయం ఎత్తాడు అంటే ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్ కూడా సరిపోరు అంత బాగా మాట్లాడతాడు.
ఫుల్ ఎనర్జీతో పవన్ గురించి స్పీచ్ లు ఇస్తాడు బండ్ల. అయితే రీసెంట్ గా బండ్ల గణేష్ పవన్ కి దేవర అనే పేరు పెట్టాడు. ఇక మీద తన దేవుడు పవన్ ని అలాగే దేవర అని పిలుస్తాను అని చెప్పాడు. దానితో పవన్ ఫాన్స్ కూడా దేవర అనే పేరు బావుంది అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. భక్త కన్నప్ప శివుడిని దేవర అని పిలిచేవాడని అందుకే తన దేవుడికి అలా పేరు పెట్టాను అంటూ బండ్ల చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ చెయ్యబోయే సినిమాకి టైటిల్ గా దేవర పెట్టమంటూ పవన్ ఫాన్స్ బండ్ల గణేష్ ని రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దేవర టైటిల్ బావుంది అదే పవన్ సర్ కి ఫిక్స్ చెయ్యి అనా అంటూ పవన్ ఫాన్స్ ట్వీట్ చెయ్యడం బండ్ల దానిని రీ ట్వీట్స్ చెయ్యడం ఇప్పుడు హైలెట్ అయ్యింది.