మెహ్రీన్ కౌర్ F3 షూటింగ్ తో బిజీగా ఉండడమే కాదు.. తన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాక మరింత హుషారుగా మారిపోయింది. సోషల్ మీడియాలో మెహ్రీన్ కౌర్ చాలా యాక్టీవ్ గా మారింది. నిశ్చితార్ధానికి ముందు మొక్కుబడిగా సోషల్ మీడియాని వాడిన మెహ్రీన్ కౌర్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోస్ ని పోస్ట్ చెయ్యడమే కాదు.. బీచ్ ఒడ్డున ఇసుక తెప్పలతో ఆడుకుంటూ తనెంత అనందంగా గడుపుతున్నానో.. గ్లామర్ షూట్స్ తో తనెంత బిజినో చెప్పకనే చెబుతుంది. రోజుకో ఫోటో తో సోషల్ మీడియాని అల్లాడిస్తున్న మెహ్రీన్ కౌర్ బాగా బరువు తగ్గి నాజూగ్గా మారింది.
తాజాగా మెహ్రీన్ కౌర్ బాలీవుడ్ లో ఓ పెళ్ళికి హాజరయ్యింది. రీసెంట్ గా బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య, నటి దిశా పార్మర్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా రాహుల్ వైద్య రిసెప్షన్ లో మెహ్రీన్ కౌర్ అద్భుతమైన చీర కట్టులో మెరిసింది. చీరకట్టులో వయ్యారాలు పోవడమే కాదు.. ఆ ఫొటోస్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెహ్రీన్ చీర కట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా,.. ఆమె సన్నటి అందాలను చీర కట్టులో మరింత అందంగా కనిపించేలా కట్టిన చీర తో మెహ్రీన్ గ్లామర్ బాగా హైలెట్ అయ్యింది. మరి మీరు మెహ్రీన్ పిక్స్ చూసి ఎంజాయ్ చెయ్యండి.