నితిన్ - తమన్నా - నాభ నటేష్ కాంబోలో బాలీవుడ్ లో హిట్ అయిన అంధధూన్ సినిమాని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ కి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మ్యాస్ట్రో మూవీ సెకండ్ వేవ్ తగ్గగానే.. చాలా త్వరగా సెట్స్ మీదకెళ్ళి బ్యాలెన్స్ మ్యాస్ట్రో షూట్ ని నితిన్ కంప్లీట్ చేసి షాకిచ్చాడు. ఇక త్వరలోనే మ్యాస్ట్రో లో రిలీజ్ చెయ్యబోతున్నారంటూ న్యూస్ రావడమే తరువాయి.. మ్యాస్ట్రో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.
అయితే త్వరలోనే రిలీజ్ అంటున్న మ్యాస్ట్రో మూవీ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అంటే ఈ సినిమాలో తమన్నా విలన్ రోల్ చేస్తుంది. గ్లామర్ హీరోయిన్ నెగెటివ్ రోల్ చెయ్యడం తో ఆ రోల్ కి మంచి హైప్ వస్తుంది. కానీ ప్రమోషన్స్ లో తమన్నా మరీ నెగెటివ్ గా ఉంటె అంతగా క్రేజ్ ఉండదు అని అనుకున్నారేమో.. అందుకే తమన్నా - నితిన్ పై అదిరిపోయే ప్రమోషనల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సాంగ్ చిత్రీకరణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ పూర్తవ్వబోతుందట. ఈ సాంగ్ మ్యాస్ట్రో సినిమాపై మరింత అంచనాలు పెంచడం ఖాయమంటున్నారు.