పోస్ట్ కరోనా షూట్ ని ఈమధ్యనే మొదలు పెట్టిన ఆర్.ఆర్.ఆర్ టీం ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని ఫైనల్ షెడ్యూల్ కోసం యూరోప్ పయనమవ్వబోతుంది అని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ యూరప్ వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్నగాక మొన్న RoarofRRR తో రాజమౌళి పలు భాషా ప్రేక్షకులలో ఆర్.ఆర్.ఆర్ పై విపరీతమైన అంచనాలు పెంచేశారు. RoarofRRR అంటూ మేకింగ్ వీడియో ని వదిలిన రాజమౌళి సినిమాపై జనాల్లో భారీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు.
ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నుండి మరో సర్ప్రైజ్ కి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అది ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ గా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నుండి అదిరిపోయే పోస్టర్ కానీ, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి ఉన్న టీజర్ కానీ వదలాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకే పోస్టర్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ని నీరు - నిప్పు లా చూపిస్తారా? లేదంటే అల్లూరి - కొమరం భీం కలిసి స్క్రీన్ ని షేక్ చేసేలా టీజర్ వదులుతారో? అని ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరి ఫాన్స్ కోరినట్టుగా, రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.