బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై గత నాలుగేళ్లుగా ఫాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. బాలకృష్ణ మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా చెప్పి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసారు. కానీ మూడేళ్లు గడిచినా మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ రావడం లేదు. ఇక మొన్నామధ్యన బాలకృష్ణ ఆయన బర్త్ డే సందర్భంగా ఆదిత్య 369 సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఆయనే డైరెక్ట్ చెయ్యొచ్చనే హింట్ కూడా ఇచ్చేసారు.
తాజాగా ఆదిత్య 369 సినిమా మూడు దశాబ్దాలు అయిన సందర్భంగా బాలయ్య మట్లాడుతూ మరోసారి వారసుడి ఎంట్రీ పై మట్లాడారు. మోక్షజ్ఞని వెండితెర పై చూడాలంటె మరో రెండేళ్లు ఆగాల్సిందే అంటూ ఫాన్స్ ని డిస్పాయింట్ చేసారు. కాకపోతే ఆదిత్య 369 సీక్వెల్ తోనే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండబోతుంది అని, ఈ సినిమాకు ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని మరింత సర్ప్రైజ్ చేసారు. అలాగే ఈ సినిమాని 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అయితే ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ ఫిలిం లో బాలయ్య కూడా నటించబోతున్నారట.