రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నాయిక. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రమిది. జాతీయ అవార్డ్ గ్రహీత లింగుస్వామి ఈ సినిమాతో రామ్ లో మరో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. తాజాగా ఆది పినిశెట్టిని విలన్ గాఎంపిక చేసారు. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో అవకాశం దక్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
దర్శకుడు వినిపించిన కథ విన్నాను. స్క్రిప్టు చదివాక వారం తీసుకున్నా.. సరైనోడు తర్వాత మళ్లీ విలన్ గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఇది విన్నాక నార్మల్ గా ఉండే రోల్ కాదనిపించింది. మామూలుగా సినిమాల్లో విలన్ పాత్రకు డీటెయిలింగ్ ఉండదు. ఇందులో అది ఉంది.
ఈ రోల్ కడప కర్నూల్ కి చెందిన రా అండ్ రస్టిక్ రోల్.. తమిళంలో మధురై బేస్ లో ఉంటుంది. సరైనోడులో స్టైలిష్ విలన్ గా చేశాక.. ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. ప్యారలల్ గా నా సినిమాలు నేను చేస్తూ డిఫరెంట్ షేడ్ ని ఇందులో చూపించవచ్చు.
యూటర్న్ నిర్మాతలతో నాకు ఇది రెండో సినిమా. రామ్ చేసిన సినిమాలన్నీ చూశాను తను చాలా ఎనర్జిటిక్ గా చేస్తుంటారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక లింగుస్వామి గారు బలమైన విలన్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించనున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఈ సినిమా లో చేస్తున్నాను. ఇలాంటి అరుదైన అవకాశాలు నటుడిగా నన్ను నేను విస్తరించడానికి అవకాశం అనుకుంటున్నాను.. షూటింగ్ కోసం వేచి చూస్తున్నాను అని అన్నారు ఆది పినిశెట్టి.