విజయ్ సేతుపతి, తమన్నా లు విడివిడిగా తెలుగు, తమిళ భషాల్లో మాస్టర్ చెఫ్ అనే వంటల ప్రోగ్రాం కి హోస్ట్ లుగా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ప్రోమో షూట్ లో పాల్గొన్న ఈజంట మాస్టర్ చెఫ్ సెట్స్ నుండి షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా విజయ్ సేతుపతి, తమన్నా ల మాస్టర్ చెఫ్ ప్రోమో జెమినీ ఛానల్ రివీల్ చేసింది. ఎంతో గ్రాండ్ గా మొదలు కాబోతున్న మాస్టర్ చెఫ్ కి తెలుగులో తమన్నా, తమిళ్ లో విజయ్ సేతుపతి వ్యాఖ్యాతలు. ఇద్దరినీ కలిపి మాస్టర్ చెఫ్ ప్రోమో రూపొందించారు. విజయ్ సేతుపతి తెలుగులో, తమన్నాకి తమిళంలో క్రేజ్ ఉంది. అందుకే ఇద్దరినీ కలిపి ప్రోమోకి వాడుతున్నారు.
ఇక తాజాగా వదిలిన మాస్టర్ చెఫ్ ప్రోమో లో విజయ్ సేతుపతి బులెట్ మీద రొమాంటిక్ గా తమన్నాని తెలుగు షో దగ్గర డ్రాప్ చెయ్యగా.. తమన్నా బైక్ దిగి వయ్యారంగా హొయలు పోతూ నడుస్తుండగా.. విజయ్ సేతుపతి.. మీ మీద నమ్మకం ఉంది.. తప్పకుండా బాగా చేస్తారని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక తమన్నా కూడా రొమాంటిక్ గా థ్యాంక్యూ బేబీ అంటే.. దానికి విజయ్ సేతుపతి ఓకె బేబీ అనడం చాలా క్యూట్ గా ఉంది. ఈ ఒక్క ప్రోమోతోనే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది జెమినీ టివి.