టాలీవుడ్ గ్లామర్ క్వీన్ కాజల్ అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. పెళ్లయినా కాజల్ అవకాశాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన కాజల్.. ఉమా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తుంది. తెలుగులో చిరు ఆచార్య మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజి లో ఉండగా.. నాగార్జున ప్రవీణ్ సత్తారు మూవీ షూట్ లోను కాజల్ ఎంటర్ అయ్యింది. గత ఏడాది కాజల్ అగర్వాల్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లోను సెటిల్ అయ్యింది.
ఇక తాజాగా కాజల్ అగర్వాల్ కలకత్తాలో బోట్ రైడ్ కి వెళ్లి నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కలకత్తా కి కాజల్ ఉమా మూవీ షూటింగ్ కోసం వెళ్ళింది. అక్కడ బోట్ రైడ్ కి వెళ్లి నేచర్ ని ఆస్వాదిస్తూ ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కోల్కత్తాలో బోట్ రైడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.