నితిన్ - మేర్లపాక గాంధీ కాంబోలో బాలీవుడ్ అంధాధూన్ సినిమాని తెలుగులో మ్యాస్ట్రో కింద రీమేక్ చేసారు. రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ ఓటిటి కి విక్రయించేశారనే న్యూస్ ఉంది. హాట్ స్టార్ మ్యాస్ట్రో మూవీకి భారీ డీల్ సెట్ చేసుకుంది అని, దాదాపుగా 35 కోట్లకి మ్యాస్ట్రో డిజిటల్ హక్కులని హాట్ స్టార్ సొంతం చేసుకుంది అని తెలుస్తుంది. త్వరలోనే నితిన్ మ్యాస్ట్రో ఓటిటి లో రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. గ్లామర్ గర్ల్ తమన్నా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో నాభ నటేష్ హీరోయిన్ గా నటించింది.
నితిన్ ఈ సినిమాలో మొదటిసారి అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం మ్యాస్ట్రో సాంగ్స్ ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. అయితే నితిన్ మ్యాస్ట్రో కి రిలీజ్ డేట్ వచ్చేసింది అని, మ్యాస్ట్రో హాట్ స్టార్ నుండి ఆగష్టు 15 న రిలీజ్ కాబోతుంది అనే న్యూస్ మొదలైంది. ఆగష్టు 15 న హాట్ స్టార్ లో మ్యాస్ట్రో స్ట్రీమింగ్ కి రానుంది అని.. త్వరలోనే మేకర్స్ కూడా మ్యాస్ట్రో రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన ఇవ్వడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది.