Advertisementt

ఇల్లీగల్ పెళ్లిపై నారప్ప హీరోయిన్ స్పందన

Thu 22nd Jul 2021 08:40 PM
narappam heroine,family man actress,priyamani,priyamani marriage,mustafa,mustafa first wife ayesha,explosive revelation  ఇల్లీగల్ పెళ్లిపై నారప్ప హీరోయిన్ స్పందన
Narappa heroine reaction on illegal marriage ఇల్లీగల్ పెళ్లిపై నారప్ప హీరోయిన్ స్పందన
Advertisement
Ads by CJ

నారప్ప హీరోయిన్, నేషనల్ అవార్డు గ్రహిత, ఢీ డాన్స్ షో జేడ్జ్ ప్రియమణి ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. కొన్నేళ్ల క్రితం అంటే 2017 లో ముస్తఫాను ప్రియమణి.. ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అప్పటికే ముస్తఫాకి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ముస్తఫా తో ఆయన మొదటి భార్య ఆయేషా 2013 సంవత్సరంలో విడిపోయింది. అయితే అయేషా తాజాగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2017 లో తన మాజీ భర్త ముస్తఫా - ప్రియమణి పెళ్లి చేసుకున్నారు. కానీ అది చట్ట విరుద్ధమని చెబుతూ సంచలనంగా మట్లాడారు. ముస్తఫా నేను ఇంకా విడాకులకు కూడా అప్లై చెయ్యలేదని, మాకు విడాకులు రాకుండానే ప్రియమణిని వివాహం చేసుకున్నారని, ఇప్పుడు ఆ పెళ్లి చెల్లదు అని అంటుంది అయేషా. 

అంతేకాకుండా ప్రియమణి, ముస్తఫాల మీద ఆయేషా కేసు నమోదు చేసింది. అలాగే అయేషా ముస్తఫాపై గృహహింస కేసు కూడా పెట్టింది. అయితే ఈకేసుపై ప్రియమణి భర్త ముస్తఫా స్పందిస్తూ.. 2010 లోనే అయేషా నుండి విపోయాను అని, 2013 లో ఆమెకి విడాకులు ఇచ్చేసానని.. విడాకుల తర్వాత ప్రతి రోజు పిల్లల కోసం అయేషాకి డబ్బు ఇస్తున్నానని.. అయేషా చెప్పేదంతా అబద్దం అని, ఆమె ఏదో తన నుండి ఆశించే ఇదంతా చేస్తుంది అని ముస్తఫా ఆరోపిస్తున్నారు. నేను 2017 లో ప్రియమణిని వివాహం చేసుకున్నా.. మరి ఇన్నేళ్లయినా అయేషా మౌనంగా ఎందుకుంది అని ఆడుతున్నారాయన. 

ఇక ఈ వివాదంపై నారప్ప హీరోయిన్ ప్రియమణి మట్లాడుతూ.. తాను తన భర్త పెళ్లి చెల్లదని హక్కు ఎవరికీ లేదని, తాను తన భర్త బంధం సురక్షితమని, ఎవరేమనుకున్నా కేర్ చెయ్యను అని అంటుంది. నాకు, ముస్తఫా మధ్య ఉన్న సంబంధంలో మేము ఖచ్చితంగా చాలా సురక్షితంగా ఉన్నాము. ప్రస్తుతం ముస్తఫా విదేశాల్లో పని చేస్తున్నాడు. ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ మేము ప్రతిరోజూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాము. ఒకవేళ కుదరకపోయినా.. అంటే షూటింగ్స్ తో బిజీగా వున్నా ఆ తర్వాత ఫోన్ మాట్లాడుకుంటామని, లేదంటే మెస్సేజ్ చేసుకుంటామని చెబుతుంది ప్రియమణి.  

Narappa heroine reaction on illegal marriage:

Priyamani marriage with Mustafa invalid, claims first wife Ayesha in explosive revelation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ