Advertisementt

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టికి ఊరట

Fri 23rd Jul 2021 02:14 PM
shilpa shetty,husband raj kundra,police custody,extended till july 27,mumbai police  రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టికి ఊరట
Shilpa Shetty Will Not Be Served Summons, Confirms Mumbai Police రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టికి ఊరట
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యి ముంబై జైలులో రిమాండ్ లో ఉన్నారు. కోర్టు జులై 23 వరకు రాజ్ కుంద్రాకి రిమాండ్ విధించి 23 న రాజ్ కుంద్రా ని కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇక ఈ కష్టడి ఇప్పుడు 23 నుండి 27 వరకు పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో నటి శిల్పా శెట్టి పాత్రపై పోలీస్ లు అనుమానాలు వ్యక్తం చెయ్యడమే కాదు.. శిల్పా శెట్టి కూడా సమన్లు ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కొస్తుంది. చాలా ఛానల్స్ లో శిల్ప శెట్టికి కూడా ముంబై పోలీస్ లు సమన్లు జారీ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. 

అయితే ఈ విషయమై ముంబై పోలీస్ లు స్పందిస్తూ.. ఈ కేసు విషయంలో ఎలాంటి సమన్లు శిల్పా శెట్టి కి జారీ చెయ్యలేదని చెప్పారు. శిల్పాశెట్టి తన కుమారుడు వియాన్ పేరిట స్థాపించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ ఆమెకి పోర్న్ రాకెట్‌తో సంబంధాలు లేవని స్పష్టమైంది. కాకపోతే వియాన్ ఇండస్ట్రీస్‌ లో కొంతమందిని విచారించేందుకు సమన్లు జారీ చేసాము. అక్కడ సిబ్బంది విచారణకు సహకరించని కారణముగా వారికి సమన్లు జారీ చేసాము. ఈ కేసులో భాగంగా యూకేకు చెందిన కెన్రిన్ అనే కంపెనీ, అలాగే హాట్ షాట్స్ యాప్ ఓనర్‌పై దర్యాప్తు చేస్తున్నాం.. అంటూ ఆ అధికారి శిల్ప శెట్టి కి సమన్లు జారీ చేశామనే విషయంలో క్లారిటీ ఇచ్చారు. 

Shilpa Shetty Will Not Be Served Summons, Confirms Mumbai Police:

Shilpa Shetty Husband Police Custody Extended Till July 27

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ