Advertisementt

ప్రభాస్ ఏమిటి ఇంత షాకిస్తున్నాడు

Sat 24th Jul 2021 11:05 AM
prabhas,prabhas - nag ashwin combo,nag ashwin,prabhas - nag ashwin crazy update,trends in twitter  ప్రభాస్ ఏమిటి ఇంత షాకిస్తున్నాడు
Prabhas - Nag Ashwin hashtag trends in Twitter ప్రభాస్ ఏమిటి ఇంత షాకిస్తున్నాడు
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్ లో రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రాధేశ్యామ్ షూటింగ్ ఫినిష్ కాగానే.. ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ కోసం ముంబై కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆదిపురుష్ - సలార్ మూవీ షూటింగ్స్ పారలల్ గా చెయ్యబోతున్న ప్రభాస్.. తన తదుపరి చిత్రం నాగ్ అశ్విన్ తో చెయ్యాలి. నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ ప్రకటించే ఏడాది గడిచిపోయింది. ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ గా ఉండబోతుంది అంటూ ప్రచారం గట్టిగా జరుగుతుంది. అలాగే భారీ కాదు అతి భారీ బడ్జెట్ తో ఈ మూవీని అశ్విని దత్ నిర్మిస్తున్నారని అంటున్నారు. 

అయితే తాజాగా నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ లాంఛనంగా పూజ కార్యక్రమాలతో ఈ రోజే మొదలు కాబోతుంది అంటూ గత అర్ధరాత్రి నుండి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లతో ట్రెండ్ అవుతుంది. అమితాబ్ కూడా హైదరాబాద్ కి ఈ మూవీ పూజ కార్యక్రమాల కోసమే రాబోతున్నారని రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు వైజయంతి మూవీస్ కానీ, నాగ శ్విన్ కానీ, ప్రభాస్ పిఆర్ టీం కానీ.. ఈ ముచ్చట సోషల్ మీడియాలో ప్రకటించలేదు. కానీ అమితాబ్ హైదరాబాద్ రాక మాత్రం ఈ మూవీ పూజ కోసమే అన్నటున్నారు. 

ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మాత్రం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. ఇక ఈ పూజ కార్యక్రమాలను సైలెంట్ గా నిర్వహించి.. ఆ తర్వాత అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రభాస్ కి జోడిగా ఎంపికైన విషయం తెలిసిందే.  

Prabhas - Nag Ashwin hashtag trends in Twitter:

Prabhas - Nag Ashwin Crazy update on 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ