హీరోయిన్ త్రిష ఈమధ్యన పెద్దగా వార్తల్లోకి రావడం లేదు. ఆచార్య సినిమా నుండి తప్పుకుని హాట్ టాపిక్ అయిన త్రిష సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ కనిపిస్తుంది. హీరోయిన్ గా స్టార్ హీరోల అవకాశాలు తగ్గాక త్రిష లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బాగా బిజీ అయ్యింది. అది కూడా కోలీవుడ్ మూవీస్ తో త్రిష తీరిక లేకుండా గడుపుతున్నది. ఆ మధ్యన చెన్నై బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న త్రిష పెళ్లి వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాని తాకడం జరుగుతూనే ఉన్నాయి.
అయితే తాజాగా త్రిష పెళ్లి పీటలెక్కబోతుంది అని, అది కూడా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ తో త్రిష కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది అని, త్రిష నటించిన ఓ సినిమాకి డైరెక్టర్ గా ఉన్న అతను త్రిష తో ప్రేమలో పడ్డాడు అని, త్రిష కూడా అతనంటే ఇష్టపడుతుండడంతో ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం మణిరత్నం భారీ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో నటిస్తున్న త్రిష.. చేతిలో మరో నాలుగు కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.