యంగ్ హీరోల కన్నా స్పీడు గా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరస లైన్ అప్ తో నందమూరి ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అఖండ మూవీ క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటున్న బాలకృష్ణ తన తదుపరి మూవీ ని గోపీచంద్ మలినేని తో చెయ్యబోతున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా బాలయ్య - గోపీచంద్ మూవీ ఉండబోతుందట. గోపీచంద్ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడితో సినిమా చెయ్యబోతున్నట్టుగా చెప్పాడు. అనిల్ రావిపూడి కూడా బాలయ్య తో సినిమా కన్ ఫర్మ్ చేసేసాడు.
ఇక ఈమధ్యన బాలయ్య అనిల్ రావిపూడి తర్వాత పూరి జగన్నాధ్ తో కూడా ఓ సినిమా ఉండబోతుంది అంటూ అనౌన్స్ చేసేసారు. పైసా వసూల్ తర్వాత పూరి తో మరో కమిట్మెంట్ ఉన్నట్టుగా చెప్పిన బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని మూవీ తర్వాత అనిల్ రావిపూడి తో కాకుండా పూరి జగన్నాధ్ తో సినిమా పట్టాలెక్కించి ఆలోచనలో ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. పూరి జగన్నాధ్ ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా మూవీ తర్వాత బాలయ్య కి కథ చెప్పి ఒప్పించేసి.. సినిమా మొదలెట్టడానికి రెడీ అవుతున్నాడట.
బాలకృష్ణ కూడా గోపీచంద్ తో పూర్తయ్యాక పూరి సినిమా చేస్తే బావుంటుంది అని అనుకుంటున్నాడట. అనిల్ ఎలాగూ కథ చెప్పలేదు.. ఈలోపు పూరి కథ చెప్పి ఒప్పిస్తే.. పూరి-బాలయ్య ప్రాజెక్ట్ ముందు మొదలవుతుందన్నమాట.