టాప్ డైరెక్టర్స్ అయినా చిన్న డైరెక్టర్స్ అయినా వారు తెరకెక్కిస్తున్న సినిమాల్లో చిన్న షాట్స్ లోనో, లేదంటే ఏదైనా సాంగ్ లో మెరవడం చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. పూరి జగన్నాధ్, రాజమౌళి, వినాయక్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ తమ సినిమాల్లో ఏదో ఒక షాట్ లో మెరిసినవారే. అయితే తాజాగా రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో ఓ సాంగ్ లో మెరవబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న ఆ సాంగ్ లో అలియా భట్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాల్గొంటున్నారు.
అదే పాటలో రాజమౌళి కూడా కనిపిస్తారని.. అది కూడా చిన్న షాట్ లో అంటున్నారు. ఇక అలియా భట్ గత నాలుగు రోజులుగా ఆర్.ఆర్.ఆర్ షూట్ లో పాల్గొంటుంది. ఈ సాంగ్ మరో రెండు రోజుల్లో పూర్తి కాగానే టీం హైదరాబాద్ నుండి ఉక్రెయిన్ బయలుదేరబోతుందట. ఉక్రెయిన్ లో ఓ సాంగ్ ని చిత్రీకరిస్తే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సాంగ్స్ మినహా ఆర్.ఆర్.ఆర్ షూట్ అంతా ఫినిష్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక అక్టోబర్ 13 నే సినిమా రిలీజ్ చేసేందుకు రాజమౌళి చాలా కష్ట అపడుతున్నారు.