Advertisementt

సలార్ లో భారీ మార్పులు?

Sun 25th Jul 2021 10:02 PM
prabhas,salaar pan india film,prabhas salaar movie,prashanth neel - prabhas combo,prabhas - shruthi haasan combo,prabhas - prashanth neel - shruthi haasan combo,salaar prabhas,prashanth neel salaar,salaar villain,salaar hero prabhas   సలార్ లో భారీ మార్పులు?
Prashant Neel reworking on Salaar script సలార్ లో భారీ మార్పులు?
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ జోరు చూస్తుంటే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. రాధే శ్యామ్ మూవీ అప్ డేట్ కూడా పక్కన పడేసి.. ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె అప్ డేట్ లతో ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇక ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీ షూటింగ్ కూడా మొదలు కావల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వలన సలార్ షూటింగ్ మొదలవ్వలేదు. అయితే ప్రశాంత్ నీల్ ముందు కెజిఎఫ్ పనులు ఫినిష్ చేసేసి సలార్ సెట్స్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. సలార్ ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడో పూర్తయ్యింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

అయితే ఇప్పుడు సలార్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని వినికిడి. సలార్ మూవీ ఇండో - పాక్ వార్ నేపథ్యంతో తెరకెక్కబోతుంది అని, సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది అనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు తాజా సమచారం ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ ట్రిమ్ చేస్తున్నాడట. ముందు  అనుకున్న సలార్ స్క్రిప్ట్ మొత్తంలో తగ్గించడానికి ఎక్కడా అవకాశం లేకపోవడం వల్లే.. ఇప్పుడు సలార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను తగ్గించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

అంటే దీనిని బట్టి ప్రభాస్ డ్యూయెల్ రోల్ అంటే ఫాదర్ అండ్ సన్ కేరెక్టర్ లో కనిపిస్తారు. ఇప్పుడు ఆ సీన్స్ ని ప్రశాంత్ నీల్ ట్రిమ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక సెకెండాఫ్‌లో వార్ ఎపిసోడ్‌ను హైలైట్ చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ కీలక మార్పులు తర్వాత సలార్ పోస్ట్ కరోనా షూట్ మొదలవుతుంది అని తెలుస్తుంది. 

Prashant Neel reworking on Salaar script:

Salaar undergoing numerous changes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ