Advertisementt

రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి కి మరో షాక్

Mon 26th Jul 2021 09:31 PM
raj kundra case,shilpa shetty,raj kundra case  రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి కి మరో షాక్
Another shock to Shilpa Shetty and Raj Kundra case రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టి కి మరో షాక్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బిజినెస్ పర్సనాలిటీ రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. రాజ్ కుంద్రా చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. రేపటితో రాజ్ కుంద్రా పోలీస్ కష్టడి ముగియనుంది. అయితే కోర్టులో రాజ్ కుంద్రా కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తితో అందరూ ఉంటే.. భర్త అరెస్ట్ తో నటి శిల్ప శెట్టి కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ముంబై పోలీస్ లు. ఇప్పటికే రాజ్ కుంద్రా కి సంబందించిన పలు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీస్ లు ఇప్పుడు శిల్పా శెట్టి బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. 

రాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీస్ ల నుంచి 48 టేరా బైట్ల కంటెంట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన పోలీస్ లు.. దానిలో ఎక్కువగా పోర్న్ కంటెంట్ ఉంది అని చెబుతున్నారు. ఇక రాజ్ కుంద్రా ఈ అస్లీల చిత్రాలను అప్ లోడ్ చేసేందుకు నాలుగు యాప్ లను తయారు చేయించారని, ఆపిల్ అండ్ గూగుల్ ప్లే స్టార్ నుండి హాట్‌షాట్‌ను తొలగించిన తరువాత రాజ్ కుంద్రా మరో నాలుగు యాప్స్ రెడీ చేసారని పోలీసులు చెబుతున్నారు. 

కానీ రాజ్ కుంద్రా పోలీస్ లు చేసిన ఆరోపణలు నిజం కాదని, తాను నిర్దోషిని అని వాదిస్తున్నాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీస్ లు మరోసారి శిల్పా శెట్టిని విచారించడానికి పోలీస్ కార్యాలయానికి పిలవొచ్చనే ప్రచారం జరుగుతుంది. 

Another shock to Shilpa Shetty and Raj Kundra case:

Raj Kundra Case: Shilpa Shetty cried many times during interrogation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ