Advertisementt

మీసం తీసేసి.. నానీకి తొందరెక్కువే!

Mon 02nd Aug 2021 10:35 AM
shyam singha roy,nani,ante sundaraniki,natural star,netizens  మీసం తీసేసి.. నానీకి తొందరెక్కువే!
Nani Ready to ante sundaraniki Movie Shooting మీసం తీసేసి.. నానీకి తొందరెక్కువే!
Advertisement
Ads by CJ

న్యాచురల్ స్టార్ నానికి కాస్త తొందరెక్కువే. అదెలా అనుకుంటున్నారా? తాజాగా నాని తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన వీడియో చూసిన ఎవరైనా ఈ మాట అనకమానరు. ఈ వీడియోలో నాని.. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తయిపోయింది అని తెలుపుతూ.. ట్రిమ్మర్‌తో తన మీసాన్ని తీసేశాడు. కట్ చేస్తే.. ఆయన తదుపరి నటించబోతోన్న ‘అంటే సుందరానికీ’ లుక్ రెడీ అన్నట్లుగా థంబ్ చూపించాడు. అరే.. అలా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తయిందో, లేదో వెంటనే మరో సినిమాకి, అదీ కూడా మీసం తీసేసి.. ఏంటి నానికి ఇంత తొందర? అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు చేస్తున్న సినిమాకి, ఆయన పోస్ట్ చేసిన వీడియోకి బాగా సింక్ అయిందని కొందరు, ఇన్నాళ్ల నుంచి ఖాళీగానే ఇంటిలోనే ఉన్నాడుగా.. ఆ మాత్రం తొందరపాటు ఉంటుందిలే అని మరికొందరు కామెంట్స్ చేశారు.

ఇక నాని హీరోగా నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా తర్వాత నాని చేయబోతున్న ‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ భామ ఈ సినిమా సెట్స్‌లోకి ఎంటరైంది.

Nani Ready to ante sundaraniki Movie Shooting:

Nani shyam singha roy Shooting completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ