నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైలు పాలయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ కష్టడిలో ఉన్న రాజ్ కుంద్రా అంతు తేల్చేవరకు పోలీస్ లు నిద్రపోయేలా కనిపించడం లేదు. నీలి చిత్రాలను యాప్ లలో అప్ లోడ్ చేశారనే ఆరోపణలతో జైలు కి వెల్లిన రాజ్ కుంద్రా కి మరో రెండు వారాల పాటు పోలీస్ కష్టడిని పొడిగించింది కోర్టు. దానితో రాజ్ కుంద్రా మరో రెండు వారాలు పాటు జైలులో ఉండబోతున్నారు. ఈ లోపు రాజ్ కుంద్రా లాయర్ బెయిల్ కోసం హై కోర్టులో పిటిషన్ వేశారు.
రాజ్ కుంద్రా కి ఈ కేసులో బెయిల్ ని నిరాకరిస్తూ పిటిషన్ ను ముంబై కోర్టు కొట్టివేసింది. కేవలం రాజ్ కుంద్రాదే కాకుండా ఈ కేసులో ఇవాల్వ్ అయిన ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు నిరాకరించింది. ఇక నటి శిల్ప శెట్టి కి కూడా ఈ కేసుతో సంబంధం ఉంది అనే కోణంలో పోలీస్ లు ఆరా మొదలు పెట్టారు. ఈ కేసులో శిల్పా శెట్టి ని కూడా పోలీస్ లు విచారణకు పిలవడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది.