బుల్లితెర నటీనటులు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. అంతేకాదు.. ఏ సీరియల్ లోనో కలిసి నటించే వారు ఆ తర్వాత రియల్ లైఫ్ లో జంటగా మారిన వారు ఉన్నారు. అయితే ఈ మధ్యన బుల్లితెర మీద కలిసి ఓ సీరియల్ లో నటించిన నవ్య స్వామి - రవికృష్ణ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. నవ్య స్వామి - రవికృష్ణ జంటగా స్టార్ మా లో ఆమె కథ సీరియల్ లో నటించారు. అలాగే బయట కూడా బాగా ఫ్రెండ్లీ గా ఉండడంతో.. అందరూ వీరు పెళ్లికి చేసుకోబోతున్నారనే అంటున్నారు. ఇక ఈటీవీలో ఓ ప్రోగ్రాం లో వీళ్ళకి పెళ్లి కూడా చేసారు.
అయితే తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో పాల్గొన్న ఈ జంట అక్కడ చేసిన షో కి అంటే గాల్లో ఎత్తుకుని నవ్య ని రవికృష్ణ తిప్పడం లాంటివన్నమాట. అది చూసిన ఆ షో యాంకర్ సుధీర్ ఏమిటి నవ్య.. రవికృష్ణ కి నీకు మధ్యన సం థింగ్ సం థింగ్ అంటున్నారు. అసలు మీ రిలేషన్ కి అర్ధం ఏమిటి చెప్పు అనగా దానికి నవ్య అండ్ రవికృష్ణ లు ఇద్దరూ.. మా మధ్యన ప్రేమ లాంటిదేం లేదు.. మా మధ్యన ఉన్నది 100% ఫ్రెండ్ షిప్ప్ మాత్రమే అంటూ తమ మధ్యన ప్రేమ, పెళ్లి లాంటిదేం లేదు.. కేవలం ఫ్రెండ్ షిప్ తప్ప అంటూ క్లియర్ గా తమ రిలేషన్ ని బయటపెట్టేసారు.