టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా ముందుకు దూసుకుపోతుంది. ఇండియా నుండి స్టార్ షెట్లర్ పీవీ సింధు నేడు ప్రీక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ఆమె తన ప్రత్యర్థి 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్(డెన్మార్క్) పై 21-15,21-13 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్ ఆద్యంతం సింధు ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించారు.
మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా పి.వి.సింధు చెలరేగిపోయింది. దీంతో ఆమె పతకానికి మరింత చేరువైంది. బుధవారం జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సింధు 21-9 21-16తో 34వ ర్యాంక్ క్రీడాకారిణి నాన్ చూంగ్ (హాంకాంగ్)ను చిత్తుచేసింది. సింధు తన కెరీర్‌లో చూంగ్‌పై ఆరోసారి పైచేయి సాధించింది.