పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ సెకండ్ వేవ్ కి ముందు ఏప్రిల్ 9 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీసుని షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గెటప్, పవన్ యాక్షన్, రొమాన్స్, సత్యదేవ్ గా పవన్ లుక్స్, లాయర్ సాబ్ కేరెక్టర్, అంజలి, నివేత పెరఫార్మెన్స్, వేణు శ్రీరామ్ మేకింగ్, దిల్ రాజు బడ్జెట్ అన్ని వకీల్ సాబ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అందులోనూ మూడేళ్ళ తర్వాత పవన్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేసరికి పవన్ ఫాన్స్ ఆగుతారా.. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేసారు.
వెండికితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లోను హిట్ గా నిలిచింది. అదే సినిమా బుల్లితెర మీద జీ తెలుగులో ప్రసారమయ్యి బ్లాక్ బస్టర్ రేటింగ్ తో దూసుకుపోయింది. థియేటర్స్ లోనే కాదు.. పవన్ పవర్ బుల్లితెర మీద కూడా చూపించాడు. ఆదివారం సాయంత్రం జీ తెలుగులో ప్రసారం అయిన వకీల్ సాబ్ కి ఏకంగా 19.12 రికార్డ్ టిఆర్పి రేటింగ్ రావడం ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. పవర్ స్టార్ పవన్ పవర్ చూసారా అంటూ పవన్ ఫాన్స్ కాలరెగరేస్తున్నారు.