Advertisementt

శిల్పాతో స్ట్రగుల్ అవుతున్నానంటున్న రాజ్ కుంద్రా

Thu 29th Jul 2021 06:50 PM
sherlyn chopra,shilpa shetty,sherlyn explosive accusation,against,raj kundra  శిల్పాతో స్ట్రగుల్ అవుతున్నానంటున్న రాజ్ కుంద్రా
Sherlyn Chopra explosive accusation against Raj Kundra శిల్పాతో స్ట్రగుల్ అవుతున్నానంటున్న రాజ్ కుంద్రా
Advertisement
Ads by CJ

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయ్యి పోలీస్ రిమాండ్ లో ఉన్నాడు. శిల్పా శెట్టి భర్త అరెస్ట్ అయ్యాక తన భర్త నిర్దోషి అని వాదిస్తుంది. ఇక రాజ్ కుంద్రా కి చెందిన సంస్థలో చాలామందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీస్ లకి ఈ కేసులో విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. రాజ్ కుంద్రా అరెస్ట్ తో పూనమ్ పాండే, ఇంకొంతమంది నటీమణులు రాజ్ కుంద్రా పై విరుచుకుపడుతున్నారు. మరోపక్క ఈ కేసు విషయం ఫిబ్రవరి నుండే పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నటి షెర్లిన్ చోప్రా కి కూడా ఈ కేసులో పోలీస్ లు నోటీసు లు పంపారు. 

షెర్లిన్ చోప్రా ఈ ఏడాది ఏప్రిల్ లోనే రాజ్ కుంద్రా పై కేసు పేట్టింది. 2019 లో రాజ్ కుంద్రా తన బిజినెస్ మేనేజర్ కి ఫోన్ చేసి మీటింగ్ కి పిలిచారని, 2019 లో మార్చి లో తమ మధ్యన బిజినెస్ మీటింగ్ జరిగింది అని, కానీ ఓ రోజు రాజ్ కుంద్రా చెప్పకుండా తన ఇంటికి వచ్చి తనని హాగ్ చేసుకుని ముద్దులు పెట్టాడని, తాను వారిస్తున్నా కుంద్రా పట్టించుకోలేదని షెర్లిన్ పోలీస్ లకి ఫిర్యాదు చేసింది. 

అసలు పెళ్లయిన వ్యక్తితో తాను సంబంధం పెట్టుకోవాలని అనుకోలేదని, అంతేకాకుండా బిజినెస్ కి శారీరక సుఖానికి డీలింగ్ పెట్టాలనుకోలేదని, కానీ రాజ్ కుంద్రా మాత్రం తనకు తన భర్య శిల్ప శెట్టికి మధ్యన పొసగడం లేదని, శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని.. ఇంటి వద్ద ఎంతో స్ట్రెస్ కు గురవుతున్నానని రాజ్ కుంద్రా తనకి చెప్పి తనని లొంగ దీసుకోవాలనుకున్నాడని భయంతో తాను వాష్ రూమ్ కి పారిపోయానంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 

Sherlyn Chopra explosive accusation against Raj Kundra:

Sherlyn Chopra Explosive Accusation Against Raj Kundra

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ